*"ప్రేమకథలు నచ్చని మనుషులు ఉండరు కదా. ఎందుకంటే ప్రేమ లేని జీవితం ఉండదు కనుక!" అని హీరో సుధీర్‌బాబు అంటున్నారు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కృతిశెట్టి హీరోయిన్గా ఓ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను మార్చి 1న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చెబుతూ ప్రత్యేక వీడియోను శనివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సుధీర్‌బాబు 'ప్రేమకథ'.. తండ్రితో 'గాలి సంపత్' - టాలీవుడ్ న్యూస్
దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా గాలి సంపత్ ట్రైలర్ విడుదలైంది. సుధీర్‌బాబు-కృతిశెట్టి జంటగా నటిస్తున్న సినిమా టైటిల్‌ను మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
సుధీర్‌బాబు 'ప్రేమకథ'.. తండ్రితో 'గాలి సంపత్'
*సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సినిమా 'గాలి సంపత్'. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించగా, అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ సహా స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి శనివారం విడుదల చేశారు. ఇందులో రాజేంద్రప్రసాద్ కేవలం ‘ఫిఫీ’ అనే సౌండ్‌తోనే సంభాషణలు పలకడం విశేషం. మార్చి 11న థియేటర్లలోకి సినిమా రానుంది.
ఇవీ చదవండి: