తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్రీదేవి సోడా సెంటర్'​లో హీరో సుధీర్​బాబు - పలాస సినిమా డైరెక్టర్ కొత్త సినిమా

సుధీర్​బాబు-కరుణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు 'శ్రీదేవి సోడా సెంటర్' టైటిల్ ఖరారు చేశారు. తాజాగా మోషన్ పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నారు.

Sudheer Babu- director Karuna Kumar film as titled Sridevi Soda Center
'శ్రీదేవి సోడా సెంటర్'​లో హీరో సుధీర్​బాబు

By

Published : Oct 30, 2020, 5:17 PM IST

Updated : Oct 30, 2020, 5:35 PM IST

'పలాస 1978' సినిమాతో మెప్పించిన దర్శకుడు కరుణ కుమార్.. యువ కథానాయకుడు సుధీర్​బాబుతో కొత్త చిత్రం చేస్తున్నారు. దీనికి 'శ్రీదేవి సోడా సెంటర్' టైటిల్ ఖరారు చేస్తూ మోషన్​ పోస్టర్​ను శుక్రవారం విడుదల చేశారు.

ఈ వీడియోలో భాగంగా జాతరలో సోడాను తన తలకు ఆనించిన సుధీర్​బాబు.. భుజంపై సీరియల్ లైట్లు వేసుకుని కనిపించారు. దీంతో 90ల్లోని పల్లెటూరి కథాంశంతో ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. విజయ్ చిల్లా-శశిదేవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Last Updated : Oct 30, 2020, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details