టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'వి'. ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. దీంతో యువ నటుడు సుధీర్ బాబు.. ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వేడుక జరుపుకొన్నాడు. సినిమాకు మంచి టాక్ రావడం చాలా సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
'వి' హీరో సుధీర్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ - నాని సుధీర్ బాబు
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వి'. శనివారం విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి పార్టీ చేసుకున్నాడు నటుడు సుధీర్ బాబు.
'వి' హీరో సుధీర్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
'వి' సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. సుధీర్‌బాబు సరసన నివేదా థామస్, నాని సరసన అదితీ రావు హైదరి నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు.