'మయూరి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి, నృత్యకారిణి సుధాచంద్రన్ తండ్రి కేడీ చంద్రన్(86) కన్నుమూశారు. గుండెపోటు రావడం వల్ల ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఇటీవల ఓ టీవీ ఛానల్‌తో చెప్పారు సుధాచంద్రన్. ఆయన బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రముఖ నటి సుధాచంద్రన్ ఇంట్లో విషాదం - Sudha Chandran latest news
నటి, డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుధాచంద్రన్ ఇంట్లో విషాదం. ఆమె తండ్రి కేడీ చంద్రన్ మరణించారు.

సుధాచంద్రన్
స్వతహాగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన సుధాచంద్రన్.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో నటించారు. పలు టీవీ సీరియళ్లలోనూ కీలక పాత్రలు పోషించి, అభిమానుల్ని సంపాదించుకున్నారు.