తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నేను బాగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు' - సుద్దాల అశోక్​ తేజ తాజా వార్తలు

ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్​ తేజ ఇటీవలే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై సామజిక మాధ్యమాల్లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన అశోక్​.. పుకార్లను పట్టించుకోవద్దని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

suddala ashok teja clarity about his health condition
నేను బాగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు

By

Published : Jul 12, 2020, 10:12 AM IST

ఇటీవల కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, ఆయన ఆరోగ్యంపై వదంతులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

"నేను బాగానే ఉన్నా. శస్త్రచికిత్స జరిగి 47 రోజులైంది. నా ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోంది. నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను సంతోషంగా ఉన్నా. నా గురించి వస్తున్న వదంతులేవీ నమ్మొద్దు. నా ఆరోగ్యం పట్ల ఎవరికైనా స్పష్టత కావాలంటే నేరుగా నాకే ఫోన్‌ చేయండి."

-సుద్దాల అశోక్​ తేజ

శస్త్ర చికిత్స జరగకముందు నుంచీ సుద్దాల అశోక్‌ తేజ ఆరోగ్యం గురించి అనేక పుకార్లు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో నటుడు ఉత్తేజ్‌ ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ఆస్పత్రి నుంచి కోలుకుని వచ్చిన తర్వాత సుద్దాల తేజ కూడా ఇది వరకే ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి వదంతులపై స్పందించారు.

ఇదీ చూడండి:'మీరు త్వరగా కోలుకోవాలి అమితాబ్​'

ABOUT THE AUTHOR

...view details