దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి మధ్య ఉన్న సంబంధంలో.. దర్శకుడు మహేశ్ భట్ పాత్ర ఏంటని ప్రశ్నించింది బాలీవుడ్ నటి సుచిత్ర కృష్ణమూర్తి. ప్రస్తుతం జరుగుతున్న సుశాంత్ కేసు దర్యాప్తులో మహేశ్ భట్‌కు సీబీఐ సమన్లు జారీ చేసిందా? అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించింది సుచిత్ర.
"మహేశ్ భట్‌ను సీబీఐ విచారణకు పిలిచిందా? జూన్ 8వ తేదీన సుశాంత్ నివాసాన్ని రియా ఎందుకు విడిచిపెట్టి వచ్చింది" అని ట్వీట్ చేసింది నటి సుచిత్ర కృష్ణమూర్తి.
రియా, మహేశ్ భట్ చాటింగ్
నటి రియా, మహేశ్ భట్ వాట్సాప్ చాటింగ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని స్క్రీన్షాట్లు వైరల్ అయ్యాయి. అందులో జూన్ 8న రియా తన ప్రియుడైన సుశాంత్ నివాసాన్ని విడిచి వచ్చినట్లు మహేశ్ భట్‌కు సందేశాన్ని పంపింది. దానికి మహేశ్ భట్.. "వెనక్కి తిరిగి చూడకు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించు" అని జవాబిచ్చారు.
సుశాంత్‌ను రియా ప్రేమించడం పట్ల ఆమె తండ్రి ఆనందంగా లేరని ఈ సంభాషణ ద్వారా మహేశ్ భట్ చెప్పినట్లు స్క్రీన్షాట్ల ద్వారా తెలుస్తోంది. సుశాంత్ మృతి తర్వాత సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నారు దర్శకుడు మహేశ్ భట్.