'భాగమతి' తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'నిశ్శబ్దం'. ఈ సినిమాలోని నటులకు సంబంధించిన పాత్రలనువరుసగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది చిత్రబృందం. తాజాగా ప్రముఖ నటుడు సుబ్బరాజు పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేసింది. ఈ మూవీలో వివేక్ అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపించనున్నాడీ నటుడు.
'నిశ్శబ్దం' నుంచి సుబ్బరాజు లుక్ విడుదల - నిశ్శబ్దం సినిమా వార్తలు
అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'నిశ్శబ్దం' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని సుబ్బరాజు పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేసింది చిత్రబృందం.

'నిశ్శబ్దం' నుంచి సుబ్బరాజు లుక్ పోస్టర్ విడుదల
మాధవన్, అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలినీ పాండే తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ కూడా కనిపించనున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
ఇవీ చూడండి.. 'జ్వాల'గా రానున్న 'బిచ్చగాడు' హీరో