తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టైలిష్ చిత్రాల దర్శకుడితో అక్కినేని హీరో! - అఖిల్ ఐదో చిత్రం

అక్కినేని యువ హీరో అఖిల్ తన ఐదో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

స్టైలిష్ చిత్రాల దర్శకుడితో అక్కినేని హీరో!
స్టైలిష్ చిత్రాల దర్శకుడితో అక్కినేని హీరో!

By

Published : Aug 11, 2020, 7:26 PM IST

మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాందించుకున్న అక్కినేని యువనటుడు అఖిల్. ఇప్పటివరకు ఇతడు నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయినప్పటికీ తన నాలుగో చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'​తో హిట్ అందుకుంటాననే ఆశాభావంతో ఉన్నాడు అఖిల్.

ఈ సినిమా సెట్స్​పై ఉండగానే ఇప్పుడు మరో చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట అఖిల్. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన తర్వాతి ప్రాజెక్ట్ చేయనున్నాడని టాక్. ఇప్పటికే 'సైరా' తర్వాత సురేందర్ రెడ్డి సినిమాపై అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్​, అల్లు అర్జున్​తోనూ ఈ దర్శకుడు సినిమాలు తీసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో సురేందర్ ఎవరితో సినిమా చేస్తాడో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details