తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లు ఫ్యామిలీ నుంచి భారీ స్టూడియో - అల్లు కుటుంబం

నేడు (గురువారం) ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జయంతి. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించింది అల్లు ఫ్యామిలీ. ఈ క్రమంలోనే అల్లు పేరిట ఓ భారీ స్టూడియో నిర్మాణాన్ని ప్రారంభించారు.

Studio launched by Allu family
అల్లు ఫ్యామిలీ నుంచి భారీ స్టూడియో

By

Published : Oct 1, 2020, 3:16 PM IST

'పుట్టిల్లు' చిత్రంతో వెండితెరకు పరిచయమై.. కొన్ని వందల సినిమాల్లో నటించి హాస్యానికి మారుపేరుగా నిలిచారు అల్లు రామలింగయ్య. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా అల్లు కుటుంబం ఆయనికి ఘన నివాళులు అర్పించింది. దీనికి నిర్మాత అల్లు అరవింద్​తో పాటు ఆయన తనయులు బాబీ, అర్జున్, శిరీశ్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఓ భారీ స్టూడియోకు శంఖుస్థాపన చేశారు. 'అల్లు స్టూడియోస్'​ పేరుతో ఇది నిర్మితమవుతోంది.

సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా దీనిని నిర్మించనున్నారు. దీనిపై అల్లు ఫ్యామిలీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details