టాలీవుడ్ యువ జంట అక్కినేని నాగచైతన్య, సమంతల అనుబంధానికి పదేళ్లు నిండాయి. 2017లో వివాహం చేసుకున్న వీరు.. ఆదివారంతో ఆ బంధానికి రెండేళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా సామ్ సోషల్‌మీడియాలో ప్రత్యేకమైన పోస్ట్ చేసింది. తన ప్రియమైన భర్త చైతన్యతో కలిసి వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆయనతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది.
" మా ప్రేమ మరింత బలపడింది.. పదేళ్ల ప్రేమకథలో రెండో వివాహ వార్షికోత్సవం. నీ ప్రేమకు బందీనయ్యా చైతన్య" అని సామ్ భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది.
ఈ సందర్భంగా నెటిజన్లు, ఫ్యాన్స్‌తోపాటు సినీ ప్రముఖులు చై-సామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హన్సిక, లావణ్య త్రిపాఠి, కాజల్, త్రిష, రకుల్‌ప్రీత్ సింగ్, కోన నీరజ, అల్లు స్నేహారెడ్డి తదితరులు విషెస్ తెలిపారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని నమ్రత, కాజల్, హన్సిక, నీరజ, లావణ్య, స్నేహారెడ్డి కామెంట్ చేశారు.
" సో క్యూట్.. ఆ దేవుడు మీ ఇద్దర్ని ఆశీర్వదించాలి"
-త్రిష, సినీ నటి