కరోనా పరిస్థితుల రీత్యా అనుకోకుండా షూటింగ్స్ నుంచి ఖాళీ దొరకడంతో సినీ తారలు తమ కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. అంతేకాకుండా తమ రోజువారీ వ్యాపకాల గురించి సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్‌డౌన్‌లో వీకెండ్‌ను ఎలా గడుపుతున్నారో తెలియచేస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా పలు వీడియోలను ఫొటోలను షేర్ చేశారు.
లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో చూడండి.. - namrata
లాక్‌డౌన్‌లో వీకెండ్‌లో ఎలా గడుపుతున్నారో తెలియచేస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వీడియోలను షేర్ చేస్తున్నారు. నమత్ర మహేశ్, సితార, గౌతమ్ వీడియో షేర్ చేయగా.. నటుడు ఆర్య ఇంట్లో వర్కౌట్లు చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహేశ్, సితార, గౌతమ్‌లకు సంబంధించిన ఓ పాత వీడియోను నమ్రత పోస్ట్ చేయగా.. నటుడు ఆర్య ఇంట్లో ఉండే వర్కౌట్లు ఎలా చేసుకోవచ్చో చూపిస్తూ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు సన్నీలియోనీ వంట చేస్తుండగా.. రకుల్ తన తమ్ముడితో కలిసి కబడ్డీ.. మంచులక్ష్మి డ్యాన్స్ చేస్తున్నారు. అల్లు శిరీష్ మాత్రం వీకెండ్‌లో తన లైఫ్ ఎలా ఉందో చూపిస్తూ ఓ స్పెషల్ వీడియోను పంచుకున్నారు. మరోవైపు సుమ.. ‘సూపర్2’ షోకు సంబంధించిన స్పెషల్ వీడియోను పంచుకున్నారు.