తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మగాళ్లూ జాగ్రత్త.. ఆ 'స్త్రీ' మళ్లీ వస్తోంది! - rajkumar rao

2018లో ఘన విజయం సాధించిన 'స్త్రీ' చిత్రానికి సీక్వెల్ రానుంది. వచ్చే ఏడాది పట్టాలెక్కనుందీ ప్రాజెక్టు. తొలి భాగంలో నటించిన తారాగణమే సీక్వెల్లోనూ నటిస్తారని బాలీవుడ్ వర్గాల సమాచారం.

స్త్రీ

By

Published : May 4, 2019, 8:00 PM IST

Updated : May 5, 2019, 10:57 AM IST

రాజ్​కుమార్​ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం 'స్త్రీ'. గత ఏడాది ఘన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. వచ్చే సంవత్సరం పట్టాలెక్కనుంది హర్రర్​ కామెడీ చిత్రం. ప్రస్తుతం స్క్రిప్టు దశలోనే ఉన్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.

మధ్యప్రదేశ్​లోని చందేరి అనే పట్టణంలో మగవాళ్లని అపహరించుకునే ఓ దెయ్యం చుట్టూ తిరుగుతోంది ఈ చిత్రకథ. తొలి భాగంలో ప్రధాన పాత్రల్లో నటించిన వారేసీక్వేల్లోనూ ఉంటారని సమాచారం.

అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన 'స్త్రీ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 180కోట్లు కొల్లగొట్టింది. దినేశ్ విజయన్, రాజ్- డీకే ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇదే బ్యానర్​లోనే రాజ్​కుమార్​ రావ్ 'రూ అఫ్జా' అనే మరో హర్రర్ చిత్రంలో నటిస్తున్నాడు. జాన్వి కపూర్ ఆ సినిమాలో హీరోయిన్.

Last Updated : May 5, 2019, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details