ఒక సినిమాలో స్టార్ నటులు కలిసి నటిస్తే ఆ సినిమా తెరకెక్కించిన దర్శకుడితో సహా ప్రతిఒక్క సినీ ప్రేక్షకుడికి ఎక్సైటింగ్‌గానే ఉంటుంది. అయితే అంతకన్నా తన సినిమా కథే తనను ఎక్కువగా ఉత్తేజపరుస్తుందని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ప్రతిష్టాత్మకంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు నాగ్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కూడా నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు బడా నటులు తన చిత్రంలో నటిస్తున్నారు అనే విషయం కన్నా ఈ సినిమా కథే తనను ఎక్కువ ఎక్సైటింగ్కు గురిచేస్తుందని చెప్పారు.
'ప్రభాస్, బిగ్‌బీ, దీపిక కన్నా కథే నాకు ఎక్సైట్మెంట్' - దీపికపదుకొణె అమితాబ్ ప్రభాస్ నాగ్ అశ్విన్
తన సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే అంతకన్నా తన సినిమా కథే ఎక్కువ ఎక్సైటింగ్‌గా ఉంటుందని చెప్పారు. తనకు కథే ముఖ్యమని వెల్లడించారు.
నాగ్
తరుణ్ భాస్కర్, బీవీ నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి కలిసి సంయుక్తంగా తెరకెక్కించిన 'పిట్టకథలు' వెబ్‌సిరీస్ ప్రమోషన్లో పాల్గొన్న నాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ప్రభాస్, అమితాబ్, దీపికా కలిసి నటించడం డ్రీమ్ కాంబినేషన్. ఈ ముగ్గురు నాకు చాలా ఇష్టం. అయితే అంతకన్నా నా సినిమా కథే నాకు ముఖ్యం. అదే ఎక్కువ ఎక్సైటింగ్‌గా ఉంది. ఈ ముగ్గురు కలిసి నా కథలో పాత్రలు పోషించడం ఆనందంగా ఉంది." అని అన్నారు.
ఇదీ చూడండి:ప్రభాస్ సినిమాలో అమితాబ్ 'అతిథి' కాదు!