'పుష్పక విమానం'.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ ప్రయోగం, ఓ సంచలనం, ఓ అద్భుతం. నటీనటులకు ఇదొక సాహసం. మాటల్లేకుండా కేవలం హావభావాలతోనే నడిచే కథ కావడం ఈ చిత్ర విశేషం.
కమల్ హాసన్, అమల జంటగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇందులో అమల అందం, అభినయం ప్రతి ఒక్కరిని ఫిదా చేశాయి. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. అమల స్థానంలో మొదటగా బాలీవుడ్ ముద్దుగుమ్మ మాధురీ దీక్షిత్‌ను తీసుకోవాలని దర్శకుడు సింగీతం భావించారని తెలిసింది.