టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్.. తన గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవలే ఓ వీడియోను విడుదల చేశాడు గాయకుడు సోనూ నిగమ్. భారతీయ సంగీత పరిశ్రమలో మ్యూజిక్ మాఫియా రాజ్యమేలుతోందని వెల్లడించాడు. దీనిపై తాజాగా భూషణ్ కుమర్ భార్య, నటి దివ్యా ఖోస్లా కుమార్ ఇన్స్టాగ్రామ్లో స్పందించింది.
"మీరు (సోనూ నిగమ్) గొప్ప గాయకులు. అలాంటి మీరు ఎంతమందికి అవకాశాన్ని ఇచ్చారు. ఎవరికీ ఇవ్వలేదు. కానీ, టీ-సిరీస్లో 97 శాతం మంది చిత్రపరిశ్రమకు చెందిన వారు కాకుండా బయటి వాళ్లే ఉన్నారు. మీలో ఉన్న ప్రతిభను చూసి గుల్షన్ కుమార్ మీకు అవకాశాన్ని ఇచ్చారు. గుల్షన్ కుమార్ మరణం తర్వాత టీ-సిరీస్ మునిగిపోతుందన్న సందేహంతో మరో సంగీత సంస్థతో మీరు ఒప్పందం కుదుర్చున్నారు. మీకు కనీస కృతజ్ఞతా భావమైనా లేదు".