తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ స్టార్టప్​లో 'దీపిక' రూ. 20 కోట్ల పెట్టుబడులు - దీపిక పెట్టుబడులు

సినిమా మెరుపులు ఉన్నంతవరకే వెలుగు. వరుసగా నాలుగు చిత్రాలు ఫట్‌మంటే పాపులారిటీ కనుమరుగైపోతుంది. ముఖ్యంగా హీరోయిన్లకు ఇది బాగా వర్తిస్తుంది. అందుకే ఒక్క దీన్నే నమ్ముకుంటే లాభం లేదనుకుంది దీపికా పదుకొణె. తెలివిగా ఎప్పుడో వ్యాపారంలోకి దిగింది. తాజాగా ఓ స్టార్టప్‌లో రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టిందట. మిగతా ఇన్వెస్ట్‌మెంట్స్‌ మాటేంటంటే..

Deepika Padukone
దీపికా పదుకొణ్

By

Published : Jul 17, 2021, 11:13 AM IST

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత మన హీరోయిన్లకు బాగా తెలుసు. అందుకే స్టార్​లుగా వెలుగొందుతున్న సమయంలోనే వ్యాపారాల్లోకి అడుగుపెట్టి భవిష్యత్తుకు భరోసాగా మలుచుకుంటారు. ఇదే కోవలో ఐదేళ్ల కిందట బెంగళూరులో కేఏ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో కార్యాలయం తెరిచింది బాలీవుడ్​ బ్యూటీ దిపికా పదుకొణె. అప్పట్నుంచి తన పెట్టుబడులన్నీ దీని ద్వారానే పెడుతోంది.

దీపికా పదుకొణ్‌
  • 2017లో FURLENCO,PURPIL' అనే రెండు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. మొదటి స్టార్టప్‌ దేశంలోని ప్రముఖ నగరాల్లో ఫర్నీచర్‌ని అద్దెకు ఇస్తుంటుంది. రెండోది సౌందర్యోపకరణాల అంకుర సంస్థ.
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన కొందరు ఔత్సాహికులు 2019లో 'బెల్లాట్రిక్స్‌ ఏరోస్పేస్‌' ప్రారంభించారు. ఈ స్పేస్‌ టెక్నాలజీ కంపెనీ అప్పట్లో రూ.21 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించింది. ఇందులో అత్యధికం దీపికవే.
  • డ్రమ్‌ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనూ తనకు వాటా ఉంది. 'ఎపిగమియా' బ్రాండ్‌ పేరుతో యోగర్ట్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తయారు చేస్తుందీ సంస్థ.
    దీపిక
  • దిల్లీ రాజధాని ప్రాంతంలో 'బ్లూ స్మార్ట్‌' కంపెనీ ఎలక్ట్రిక్‌ టాక్సీలు నడుపుతోంది. కొన్ని సంస్థలకు ఎలక్ట్రిక్‌ టెక్నాలజీని సైతం అందిస్తోంది. ఈ సంస్థకు మొదటి పెట్టుబడిదారుల్లో దీపిక ఒకరు.
  • 'ఫ్రంట్‌ రో' అనే ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం ప్రత్యేకంగా సెలెబ్రెటీలకే సంగీతం, క్రికెట్‌ పాఠాలు నేర్పిస్తుంటుంది. కామెడీ చేయడమెలాగో చెబుతుంది. ఇందులోనూ తనకు భారీ వాటాలున్నాయి.
  • లైవ్‌ మింట్‌ పత్రిక కథనం ప్రకారం దీపిక తాజాగా 'సూపర్‌ టెయిల్స్‌' అనే పెట్‌ స్టార్టప్‌లో దాదాపు రూ.20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది.

ABOUT THE AUTHOR

...view details