హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్.. త్వరలో కొత్త సినిమా ప్రారంభించనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే దానిపై రకరకాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నివేదా పేతురాజ్ కథానాయికగా అవకాశం దక్కించుకుందని సమాచారం.
అఖిల్ సరసన నివేదా పేతురాజ్..! - బొమ్మరిల్లు భాస్కర్
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో హీరోయిన్గా నివేదా పేతురాజ్ కనిపించనుందని సమాచారం. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు.
అఖిల్ సరసన నివేదా పేతురాజ్..!
ఇటీవలే 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా'లో తన నటనతో ఆకట్టుకుందీ భామ. ఇప్పుడు అక్కినేని కథానాయకుడి సరసన మెరిసేందుకు సిద్ధమైంది. అఖిల్ గత చిత్రం 'మిస్టర్ మజ్ను' అనుకున్నంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరి ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.
ఇది చదవండి:కొట్టుకున్న నాగార్జున-జేడీ చక్రవర్తి..!