తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa elections 2021: ఓటు వేయని సిని'మా' స్టార్స్ - maa elections news

స్వల్ప ఘటనల మినహా 'మా' ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు.. ఈసారి ఎన్నికల్లో ఓటు వినియోగించలేదు. ఇంతకీ వాళ్లెవరంటే?

stars who don't vote in MAA elections 2021
మహేశ్​బాబు ప్రభాస్

By

Published : Oct 10, 2021, 5:25 PM IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ 'మా' ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా పూర్తయింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈసారి 'మా' సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఏడాది మొత్తంగా 665 మంది ఓటు వేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రకథానాయకులతోపాటు గిరిబాబు, చలపతిరావు, బాబుమోహన్‌, బ్రహ్మానందం వంటి సీనియర్‌ నటులు, రోజా, జయప్రద, జెనీలియా, అఖిల్‌, నాని.. ఇలా ఎంతో మంది సినీ తారలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రానా-వెంకటేశ్-ఎన్టీఆర్

ఎంతో హోరాహోరీగా సాగిన 'మా' ఎన్నికలకు పలువురు తారలు దూరంగా ఉన్నారు. ఓటు వేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌బాబు, తారక్‌, ప్రభాస్‌, రానా, నితిన్, నాగచైతన్య, అల్లు అర్జున్‌, శర్వానంద్‌, సునీల్‌, సుమంత్‌, సుశాంత్‌, సత్యదేవ్‌, అల్లు శిరీష్, వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, రవితేజ, అనుష్క, రకుల్‌, త్రిష, హన్సిక, ఇలియానా, నిహారికతోపాటు పలువురు తారలు ఓటు వేయలేదు. అయితే, వీళ్లందరూ తమ వ్యక్తిగత కారణాలు, వరుస షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉండటం వల్లే పోలింగ్‌కు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details