హీరో ధనుష్- హీరోయిన్ కీర్తి సురేశ్ రెండోసారి జంటగా కనిపించనున్నారని టాక్. వీరిద్దరూ ఇంతకుముందు 'తొడరి'(తెలుగులో రైల్) అనే సినిమాలో నటించారు. ఇప్పడు 'నెట్రికన్' రీమేక్ కోసం కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
మామ పాత్రలో నటించాలనే కోరికతో
1981లో రజనీకాంత్ హీరోగా వచ్చిన చిత్రం 'నెట్రికన్'. కీర్తి సురేశ్ తల్లి మేనక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్నది ధనుష్ కోరిక. ఈ విషయాన్నే అతడు ఇటీవల బయట పెట్టాడు. ఇప్పుడా చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నిజంగా విశేషమే కదా