బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ఇప్పటికే చాలామంది నాయికల పేర్లు వినిపించినా.. శ్రియ, నయనతార ఎంపికయ్యారని సమాచారం.
నాలుగోసారి ఆ భామలతో బాలయ్య..! - బోయపాటి శ్రీను కొత్త సినిమా
'ఇరువురి భామల కౌగిలిలో స్వామి..' అని ఇద్దరు భామలతో ఉండే కష్టాలేంటో చెప్తూనే అలరించాడు బాలకృష్ణ. 90ల్లో నుంచి 2019 వరకు అవకాశం వచ్చినప్పుడల్లా ఇద్దరు నాయికలతో ఆడిపాడి సందడి చేశాడు. మరోసారి ఇదే పంథా కొనసాగించనున్నాడట బాలయ్య.

నాలుగోసారి ఆ భామలతోనే బాలయ్య
శ్రియ, నయన్.. ఇప్పటికే బాలయ్యతో మూడు చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలో వాళ్లు ఖరారైతే ఇద్దరికీ నాలుగోసారి బాలయ్యతో కలిసి నటించే అవకాశం వచ్చినట్లే. బోయపాటి దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన 'తులసి' చిత్రంలో నయన్ హీరోయిన్గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో అలరించింది.
Last Updated : Feb 29, 2020, 4:41 AM IST