తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హిట్​ సినిమా​ రీమేక్​లో సూర్య-కార్తి? - cinema news

మలయాళ హిట్ సినిమా​ 'అయ్యప్పనుమ్ కోసియమ్' తమిళ రీమేక్​లో స్టార్ బ్రదర్స్ సూర్య-కార్తిలు నటించనున్నారని టాక్. ఇదే నిజమైతే వీరిద్దరూ కలిసి కనిపించబోయే తొలి చిత్రమిదే అవుతుంది.

ఆ హిట్​ సినిమా​ రీమేక్​లో సూర్య-కార్తి?
సూర్య-కార్తి

By

Published : Mar 20, 2020, 8:21 PM IST

తమిళ స్టార్ హీరోలు, అన్మదమ్ములైన సూర్య,కార్తి.. కోలీవుడ్​లోనే కాకుండా తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించలేదు. మల్టీస్టారర్ చేయాలని చాలాసార్లు అనుకున్నా, సరైన కథ కుదరక వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు కలిసి తెరను పంచుకునేందుకు సిద్ధమయ్యారట. ఈ వార్తే ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది.

హీరోలు సూర్య కార్తీ

గత నెలలో వచ్చిన మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోసియమ్'. పృథ్వీరాజ్, బిజు మేనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తమిళ హక్కుల్ని నిర్మాత కదిరేశన్ సొంతం చేసుకున్నారు. ఇందులో సూర్య-కార్తిలను నటింపజేయాలనే ఆలోచన ఉన్నారు.

ఈ సినిమాకు సంబంధించిన తెలుగు హక్కుల్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. మరి ఇక్కడ ఎవరు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారో? ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details