అందం, అభినయంతో ఆకట్టుకునే నటీమణులు మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామందే ఉన్నారు. వారంతా తరచూ సామాజిక మాధ్యమాల వేదికగా అదిరిపోయే స్టిల్స్‌తో ఫొటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు తమ చిన్నప్పటి ఫొటోలను కూడా షేర్ చేస్తుంటారు. వీటికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
టాలీవుడ్ హీరోయిన్లు చిన్నపిల్లల్లా మారిపోతే! - రష్మిక వార్తలు
సినీ తారలంటేనే అందానికి, అభినయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. అలాంటి అందమైన హీరోయిన్లు వారి చిన్నతనంలో ఎలా ఉంటారో తెలుసుకోవడంపై ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. కొంతమంది నటీమణుల చిన్ననాటి చిత్రాలంటూ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఓ ఫొటో వైరల్‌గా మారింది.
టాలీవుడ్ హీరోయిన్లను ఇలా చూశారా?
తాజాగా ఇలాంటి ఫొటోనే ఒకటి సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. మన తెలుగు స్టార్ కథానాయికలు చిన్న పిల్లలుగా మారిపోతే ఎలా ఉంటారో తెలియజేస్తూ మీమ్ తయారు చేశారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు, 'మన హీరోయిన్లు భలే క్యూట్‌గా ఉన్నారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. కీర్తి సురేశ్, రష్మిక, అనుపమ పరమేశ్వరన్, సమంత, అనుష్క, కాజల్, రాశీఖన్నా, తమన్నా, రకుల్ ప్రీత్‌సింగ్‌ల ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
Last Updated : Sep 28, 2020, 9:42 AM IST