తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజతో కాంబినేషన్​.. 'నో' చెప్పిన స్టార్‌ హీరోలు! - రావణాసుర

Ravi Teja: వరుస చిత్రాలతో బిజీగా ఉన్న మాస్​మహారాజా రవితేజ.. దర్శకుడు సుధీర్​ వర్మతో కలిసి 'రావణాసుర' అనే చిత్రం చేస్తున్నారు. అయితే ఓ తమిళ బ్లాక్​బస్టర్​ చిత్రాన్ని రీమేక్​ చేయాలని వీరు తొలుత భావించారు. కానీ అందులోని మరో ప్రధాన పాత్రలో నటించేందుకు తెలుగులోని స్టార్​ హీరోలు నో చెప్పినట్లు తెలుస్తోంది.

Ravi Teja
రవితేజ

By

Published : Jan 28, 2022, 3:33 PM IST

Ravi Teja: కథానాయకుడు రవితేజ జోరు మీదున్నారు. 'ఖిలాడి', 'టైగర్‌ నాగేశ్వర్‌రావు', 'రామారావు ఆన్‌ డ్యూటీ', 'రావణాసుర' ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే, 'రావణాసుర' తెరకెక్కిస్తున్న దర్శకుడు సుధీర్‌ వర్మతో రవితేజ కాంబినేషన్‌ వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగుంది. వీరిద్దరూ కలిసి మొదట ఒక తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని ప్లాన్‌ చేశారట. కానీ, ఆ సినిమాలో నటించడానికి తెలుగులోని స్టార్‌ హీరోలంతా విముఖత చూపడం వల్ల రీమేక్‌ను పక్కనపెట్టి.. 'రావణాసుర'ను పట్టాలెక్కించారట.

'రావణాసుర'

2017లో విడుదలైన తమిళ చిత్రం 'విక్రమ్‌ వేద' కోలీవుడ్‌లో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. అయితే, ఆ చిత్రం రవితేజకు బాగా నచ్చిందట. అందుకే, ఆ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు సుధీర్‌ వర్మతో రీమేక్‌ చేయాలని భావించారు. ఇందులో విజయ్‌ సేతుపతి పోషించిన 'వేద' పాత్రలో రవితేజ నటించాలని నిర్ణయించుకున్నారట. ఇక ఆర్‌. మాధవన్‌ పోషించిన 'విక్రమ్‌' పాత్ర కోసం తెలుగులో చాలా మంది హీరోలను సంప్రదించారట. కానీ, వారెవరూ ఆ పాత్రలో నటించేందుకు ముందుకు రాలేదు. విచిత్రంగా వాళ్లంతా 'విక్రమ్‌' పాత్రకు బదులు 'వేద' పాత్రలో నటించేందుకు ఆసక్తి కనబర్చారట. పాత్ర మార్చుకోవడానికి రవితేజ సిద్ధంగా లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అందుకే, ఆ రీమేక్‌ను పక్కనపెట్టిన రవితేజ-సుధీర్ వర్మ.. 'రావణాసుర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details