బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(akshay kumar) తల్లి అరుణ భాటియా(akshay kumar mother health) బుధువారం కన్నుమూశారు. సెప్టెంబరు 6న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలుపుతూ అక్షయ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. సినీ ప్రముఖులంతా ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
"ఆమె నా జీవితంలో కీలకం. ఆమెను కోల్పోవడం.. నాకు భరించలేని బాధ కలిగిస్తోంది. ఈరోజు మా అమ్మ అరుణ భాటియా ప్రశాంతంగా కన్నుమూసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మరో ప్రపంచంలో ఉన్న మా నాన్నతో కలిశారు. ఆమె కోలుకోవాలని మీరు చేసిన ప్రార్థనలను నేను గౌరవిస్తున్న."