నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ హీరోహీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్.. మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోనుందనే విషయం ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. తొలిసారి వీరిద్దరూ 'బ్రహ్మాస్త్ర' సినిమాలో కలిసి నటిస్తున్నారు. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాతే వీరి వివాహం జరగనుందని టాక్.
ఈ ఏడాది చివర్లో రణ్‌బీర్-ఆలియా పెళ్లి! - రణ్‌బీర్ బ్రహ్మాస్త్ర
బాలీవుడ్ ప్రముఖ నటీనటులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ల పెళ్లి.. ఈ ఏడాది ఆఖర్లో జరగనుందట. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మరి ఇందులో నిజమెంత?
![ఈ ఏడాది చివర్లో రణ్‌బీర్-ఆలియా పెళ్లి! Star couple Alia Bhatt, Ranbir Kapoor are trending again, Alia, Ranbir are reportedly looking forward to a wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5992841-192-5992841-1581088327363.jpg)
ఈ ఏడాది చివర్లో రణ్‌బీర్-అలియా పెళ్లి!
ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడే ఆలియా-రణ్‌బీర్ ప్రేమలో పడ్డారని సమాచారం. అయితే ఈ వివాహానికి ఇరు కుటుంబాలు పెద్దలు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం పెళ్లి తేదీ ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆలియా.. రణ్‌బీర్ కుటుంబంతో కలిసి వివిధ కార్యక్రమాలకు హాజరవుతోంది. తాజాగా ఓ పెళ్లికి రణ్‌బీర్, అతడి తల్లి నీతూతో కలిసి హాజరైంది. గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చినప్పుడు వాటిని కొట్టిపారేసిందీ జంట.
ఇదీ చదవండి: ఆ పాత్ర కోసం సమంత భారీ పోరాట సన్నివేశాలు
Last Updated : Feb 29, 2020, 1:50 PM IST