తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మిషన్​ ఇంపాజిబుల్'​ కోసం చిరు.. ఓటీటీలోకి 'స్టాండప్‌ రాహుల్‌' - Mission Possible prerelease event chiranjeevi

మిమ్మల్ని అలరించేందుకు కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'స్టాండప్​ రాహుల్'​ ఓటీటీ రిలీజ్​ డేట్​, తాప్సీ 'మిషన్​ ఇంపాజిబుల్'​ ప్రీ రిలీజ్ ఈవెంట్​ వివరాలు ఉన్నాయి.

standup-rahul
standup-rahul

By

Published : Mar 29, 2022, 10:26 PM IST

Standup Rahul movie ott release date: థియేటర్లలో ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని అలరించిన 'స్టాండప్‌ రాహుల్‌, చిత్రం త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. 'ఆహా'లో ఏప్రిల్‌ 8 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. రాజ్‌తరుణ్‌ హీరోగా శాంటో మెహన వీరంకి తెరకెక్కించిన చిత్రమే ‘స్టాండప్‌ రాహుల్‌’. స్టాండప్‌ కమెడియన్‌గా రాజ్‌తరుణ్‌, ఆయన ప్రేయసిగా వర్ష బొల్లమ్మ ప్రేక్షకులకు నవ్వులు పంచారు. నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, మురళీశర్మ, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tapsee Mission Possible: రోషన్‌, భానుప్రకాశ్‌, జై తీర్థ అనే బాల నటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి ఆయన వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 1ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ విశేషాన్ని పంచుకుంది. దీంతో పాటే ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను మార్చి 30న హైదరాబాద్​లో సాయంత్రం 6గంటలకు నిర్వహించనుంది. దీనికి చీఫ్ గెస్ట్​గా చిరంజీవి రాబోతున్నారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంను పట్టుకుంటే డబ్బులిస్తారనే చిన్నారుల ఆశ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ హాస్యభరిత సినిమాకి స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె. దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే

ABOUT THE AUTHOR

...view details