తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్ కేసులో ఎయిమ్స్​ నివేదికపై అనుమానాలు'

సుశాంత్​ శవపరీక్షపై ఎయిమ్స్​ ఇచ్చిన నివేదికపై తమకు అనుమానులున్నాయని సుశాంత్​ కుటుంబసభ్యుల తరపు న్యాయవాదుల బృందం అభిప్రాయపడింది. ఈ బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది వరుణ్​సింగ్​.. ఇదే విషయమై సీబీఐ డైరెక్టర్​ రిషీ కుమార్​కు లేఖ రాశారు.

SSR family's lawyer writes to CBI, questions AIIMS' 'faulty' report
సుశాంత్ కేసు: ఎయిమ్స్​ నివేదికపై అనుమానులున్నాయి

By

Published : Oct 7, 2020, 4:14 PM IST

Updated : Oct 7, 2020, 4:34 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్​ సింగ్​ను హత్య చేశారనే ఆరోపణను తోసిపుచ్చుతూ, ఎయిమ్స్​ ఫోరెన్సిక్​ ప్యానెల్ ఇటీవలే సీబీఐకి నివేదిక సమర్పించింది. దీనిని సుశాంత్ కుటుంబసభ్యుల న్యాయవాదుల బృందం తప్పుబట్టింది. ఈ క్రమంలోనే న్యాయవాది వరుణ్​సింగ్​, సీబీఐ డైరెక్టర్​ రిషీ కుమార్​ శుక్లాకు లేఖ రాశారు. ​

"సుశాంత్​ మృతి కేసులో ఎయిమ్స్​ బృందం సీబీఐకి సమర్పించిన నివేదిక అంటూ మీడియాలో వస్తున్న కథనాలను చూశాను. ఆ బృందంలోని కొందరు వైద్యులు టీవీలో వస్తున్న ఫోరెన్సిక్​ పరీక్షకు సంబంధించిన ప్రకటనలు చేయడాన్ని నేను చూశాను. నివేదిక కోసం మేం చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎయిమ్స్​ బోర్డు అధిపతి డాక్టర్​ సుధీర్​ గుప్తా నుంచి ఎలాంటి స్పందనలేదు. దీంతో ఎయిమ్స్​ అభిప్రాయానికి సంబంధించిన వార్తా నివేదిక సరైనదేనని నేను ఈ లేఖ రాస్తున్నాను. ఇలాంటి సున్నితమైన కేసులో ఎయిమ్స్​ బృందానికి అధ్యక్షత వహించిన డాక్టర్​ సుధీర్​ గుప్తా మొదటిరోజు నుంచే దీని గురించి ఇంటర్వ్యూలు ఇస్తూ.. అనైతికంగా ప్రవర్తించారు. వృత్తిపరమైన నియమాలను కాకుండా ప్రభుత్వ సేవాప్రవర్తన నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఇలాంటి చర్యలు ఎయిమ్స్​ లాంటి సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశాయి. దర్యాప్తుపై ఎంతోమంది ప్రజల మనస్సులలో సందేహాలను సృష్టించాయి. వారి నివేదిక మరణానికి గల కారణాన్ని మాత్రమే చెబుతుంది. కానీ, అది హత్యకాదు అని ఎలా నిర్ణయిస్తారు"

- వరుణ్​ సింగ్​, సుశాంత్​ కుటుంబసభ్యుల తరపు న్యాయవాది

సుశాంత్​ మృతదేహాన్ని పోస్ట్​మార్టమ్​ చేసిన కూపర్​ ఆస్పత్రి ఇచ్చిన నివేదికతో పాటు అక్కడి వైద్యులను ప్రశ్నించడం తప్ప.. ఫోరెన్సిక్​ బృందం శవపరీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనలేదని వరుణ్​ సింగ్​ అన్నారు. హత్య జరగలేదని స్పష్టం చేసిన ఎయిమ్స్ బృందం.. కనీసం సుశాంత్​ మృతదేహాన్ని పరిశీలించకుండా ఆ విషయాన్ని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి అవకతవకలపై సీబీఐ ఆరా తీయాలని లేఖలో సూచించారు.

సీబీఐ డైరెక్టర్​కు వరుణ్​ సింగ్​ రాసిన లేఖ
సీబీఐ డైరెక్టర్​కు వరుణ్​ సింగ్​ రాసిన లేఖ
సీబీఐ డైరెక్టర్​కు వరుణ్​ సింగ్​ రాసిన లేఖ
Last Updated : Oct 7, 2020, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details