బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. సుశాంత్ శవపరీక్షను విశ్లేషించి ఆత్మహత్యే అని దిల్లీ ఎయిమ్స్ ఫొరెన్సిక్ బృందం స్పష్టతనిచ్చిన రెండు రోజులకు ఈ ప్రకటన చేశారు.
'సుశాంత్ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాం' - సుశాంత్ సీబీఐ
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది సీబీఐ. ఏ ఒక్క అంశాన్ని విస్మరించకుండా సమగ్రంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది.
సుశాంత్
అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేసిన ఎయిమ్స్ ఫొరెన్సిక్ బృందం చీఫ్ సుధీర్ గుప్తా నుంచి వివరణ కావాలని సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ కీర్తి డిమాండ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తాను అడిగిన ప్రశ్నకు సుధీర్గుప్తా సమాధానమివ్వాలని స్పష్టం చేశారు శ్వేతా. "ఇలాంటి యూ-టర్న్ తీసుకోవడానికి కారణాలను తప్పక వివరించాలి" అంటూ పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి ఫోర్బ్స్-2020 టాప్ హీరోయిన్గా సోఫియా