Mahesh babu movies: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు దుబాయ్‌లో ఫ్యామిలీతో ప్రస్తుతం వెకేషన్లో ఉన్నారు. అయినా సరే కొత్త సినిమాకు సంబంధించిన వర్క్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. డైరెక్టర్ త్రివిక్రమ్, తమన్, నిర్మాత నాగవంశీతో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటించనుంది.
త్రివిక్రమ్‌తో మహేశ్.. హ్యాట్రిక్ సినిమా షూటింగ్ త్వరలో - mahesh thaman songs
Mahesh trivikram movie: 'అతడు', 'ఖలేజా' లాంటి హిట్ల తర్వాత త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి. ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూపులు చూసిన ఫ్యాన్స్.. ఫొటోలతో సర్ప్రైజ్ చేశారు మహేశ్.
త్రివిక్రమ్ మహేశ్‌బాబు మూవీ
మహేశ్ హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా.. చివరి దశ షూటింగ్లో ఉంది. ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్. బ్యాంక్ రుణాల ఎగవేత నేపథ్య కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. మైత్రీమూవీమేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇవీ చదవండి:
Last Updated : Dec 27, 2021, 6:15 PM IST