తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Mahesh Babu: మహేశ్-త్రివిక్రమ్ మూవీ క్రేజీ అప్డేట్! - మహేశ్‌బాబు త్రివిక్రమ్‌ సినిమా

Mahesh Babu: సూపర్​స్టార్​ మహేశ్​బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్​ కాంబినేషన్​లో రానున్న సినిమాపై ఓ ఆసక్తికర అప్డేట్​ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం ఫిబ్రవరి 3న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu
మహేశ్​బాబు

By

Published : Jan 31, 2022, 4:04 PM IST

Mahesh Babu: 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో మరో కొత్త సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు 28వ చిత్రంగా ఇది రూపుదిద్దుకోనుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే.. దీన్ని ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా అభిమానులను సంతోషపెట్టే ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఎస్​ఎస్​ఎంబీ 28టీమ్

కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతోన్న కారణంగా వీలైనంత త్వరగా కొత్త సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసేయాలని మహేశ్‌బాబు భావిస్తున్నారట. దీంతో మహేశ్‌ - త్రివిక్రమ్‌ల సినిమా అతి త్వరలో రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఈ సినిమా పూజా కార్యక్రమం వేడుకగా జరగనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు మహేశ్‌ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details