తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అందుకే ఆలియా భట్​ను ఎంపిక చేశాం' - అందుకే ఆలియా భట్​ను ఎంపిక చేశాం

'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఓ కథానాయికగా ఆలియా భట్​ను తీసుకోవడంపై ఆసక్తికర విషయాన్ని తెలిపారు రాజమౌళి. అదేంటంటే?

SS Rajamouli reveals the reason behing casting Alia Bhatt in RRR
'అందుకే ఆలియా భట్​ను ఎంపిక చేశాం'

By

Published : May 6, 2020, 7:42 AM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్‌ కథానాయిక ఆలియా భట్‌ నటిస్తుంది. తాజాగా ఆమె పాత్ర గురించి దర్శకుడు రాజమౌళి ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు.

"సీత పాత్ర చాలా అమాయకంగా కనిపిస్తూనే ఆమెలో అనేక రకాల భావోద్వేగాలు కలిగి ఉంటాయి. ఈ పాత్ర ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి ప్రతిభావంతుల పాత్రలకు దీటుగా నిలబడే స్థాయిలో ఉండాలి. ఇంతటి ప్రధాన ఆకర్షణ కలిగిన పాత్రకు ఆలియా భట్‌ అయితేనే సరిపోతుందనిపించి ఆమెను తీసుకున్నాం. ఇది ముక్కోణపు ప్రేమకథ కాదు" అని స్పష్టతనిచ్చారు రాజమౌళి.

ఈ చిత్రంలో ఆలియాతో పాటు మరో కథానాయికగా బ్రిటీష్‌ నటి ఒలీవియా మోరిస్‌ను ఎంపిక చేశారు. అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ABOUT THE AUTHOR

...view details