తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జాంబీరెడ్డి' దర్శకుడిపై రాజమౌళి ప్రశంసలు! - జాంబీరెడ్డి న్యూస్

'జాంబీరెడ్డి' ఆకట్టుకున్న ప్రశాంత్​ వర్మతో రాజమౌళి ముచ్చటించారు. అతడిని మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రశాంత్ ట్విట్టర్​ పోస్ట్ పెట్టాడు.

ss rajamouli praise ZOMBIE REDDY director prasanth varma
ప్రశాంత్ వర్మ రాజమౌళి

By

Published : Feb 8, 2021, 7:30 PM IST

విలక్షణ కథతో తీసిన 'జాంబీ రెడ్డి'.. ప్రేక్షకుల్ని అలరిస్తూ వసూళ్లలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్​ వర్మను పలువురు సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్​డ్రాప్​కు జాంబీ జోనర్ జోడించడం కొత్తగా ఉందని చెబుతున్నారు. ఇప్పుడు 'బాహుబలి'​ దర్శకుడు రాజమౌళి కూడా ఇతడిని మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా జక్కన్నకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రశాంత్ వర్మ పోస్ట్ పెట్టడమే ఇందుకు కారణం.

తేజ, ఆనంది, దక్ష, గెటప్ శీను తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.7.25 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం పోస్టర్​ విడుదల చేసింది.

ఇది చదవండి:మేకింగ్​ వీడియోతో భయపెడుతున్న 'జాంబీరెడ్డి'

ABOUT THE AUTHOR

...view details