తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సూర్యవంశీ' రిలీజ్.. డైరెక్టర్ రాజమౌళి ట్వీట్ - అక్షయ్ కుమార్ న్యూ మూవీ

'సూర్యవంశీ' సినిమా విడుదల సందర్భంగా విషెస్ చెబుతూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఓపికతో కేవలం థియేటర్​లోనే విడుదల చేయాలని ఏడాదిన్నర పాటు సినిమాను ఆపినందుకు అభినందనలు తెలిపారు.

SS Rajamouli pens appreciation post for team 'Sooryavanshi'
అక్షయ్ సూర్యవంశీ మూవీ

By

Published : Nov 3, 2021, 3:19 PM IST

థియేటర్స్‌లోనే సినిమాను విడుదల చేయాలన్న దృఢ సంకల్పంతో ఏడాదిన్నర పాటు 'సూర్యవంశీ' చిత్రాన్ని ఆపటం నిజంగా అభినందనీయమని అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. అక్షయ్‌కుమార్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సూర్యవంశీ'. రణ్‌వీర్‌సింగ్‌, అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్రలు పోషించారు. పోలీస్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ కథతో రోహిత్‌శెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. దీపావళి కానుకగా నవంబరు 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి ట్వీట్‌ చేశారు.

"సూర్యవంశీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. క్లిష్ట సమయాల్లో ఓపిక పట్టి, కేవలం థియేటర్‌లో మాత్రమే విడుదల చేయాలని ఏడాదిన్నర పాటు సినిమా ఆపినందుకు హృదయపూర్వక అభినందనలు" అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

రాజమౌళి ట్వీట్‌కు కరణ్‌ జోహార్‌ కృతజ్ఞతలు తెలిపారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్‌, ధర్మా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details