తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అంతర్జాతీయ స్టార్స్​తో 'ఆర్ఆర్ఆర్' హంగామా - rajamouli

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రంలో కీలకపాత్రలను ప్రకటించింది చిత్రబృందం. ఇందులో సరికొత్త హాలీవుడ్​ భామ ఒలివియా మోరిస్ ఎంపికైంది. కొమురం భీమ్​గా నటిస్తోన్న తారక్​​ సరసన జెన్నిఫర్​ పాత్రలో కనిపించనుందీ ముద్దుగుమ్మ. ఈమెతో పాటు అలిసన్​ డూడి, రే స్టీవెన్​సన్​ నటిస్తున్నారు.

SS Rajamouli confirms Olivia Morris opposite Jr NTR in #RRRMovie

By

Published : Nov 20, 2019, 4:57 PM IST

ఎన్టీఆర్‌, రామ్​ చరణ్​ కాంబినేషన్​లో.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ సినిమాలో నటించే తారాగణంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమై ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కీలకపాత్రలను ప్రకటించారు.

ఎవరీ ఒలివియా...

తారక్‌కు జోడీగా నటిస్తోంది ఒలివియా మోరిస్​. 23 ఏళ్ల ఈ అందాల భామ ఇటీవలే లండన్​లోని 'రాయల్​ వెల్ష్​ మ్యూజిక్​ అండ్​ డ్రామా' కాలేజీలో పట్టభద్రురాలైంది. కొన్నేళ్లు చిన్నారులకు నటనకు చెందిన పాఠాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచి బామ్మ వద్దే పెరిగిన ఈ నటికి.. కళలు, థియేటర్​, టీవీ, ఫిల్మ్​ రంగాలంటే చాలా మక్కువ. ఒలివియా స్కూలు స్థాయిలోనే ఆర్ట్​-ఏ లెవల్​లో శిక్షణ పొంది మంచి పేరు తెచ్చుకుంది. ఈ నటికి రోల్​ మోడల్​ కేథరిన్​ హెప్​బర్న్​. ఆమెను చూసి బాగా స్ఫూర్తి పొందినట్లు తన బ్లాగ్​లో రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

ఒలీవియా మోరిస్

అలిసన్ డూడి​... 1985 జేమ్స్​ బాండ్​ చిత్రంలో ఈ అమ్మడు నటించింది. 'ఏ వ్యూ టూ ఏ కిల్'​, 'ఇండియానా జోన్స్​ అండ్​ ది లాస్ట్​ క్రూసేడ్'​ చిత్రాల్లో మెరిసింది డూడి. తాజాగా ఆర్​ఆర్ఆర్​లో లేడీస్కాట్​ అనే విలన్​గా కనిపించనుంది.

రే స్టీవెన్​సన్​...

ఐరిష్​ నటుడు రే స్టీవెన్​సన్​ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. స్కాట్​ అనే పాత్రలో సందడి చేయనున్నాడు. ఇతడు పనిషర్​, వార్​ జోన్​, థోర్​, కిల్​ ద ఐరిష్​మ్యాన్​ వంటి హాలీవుడ్​ సినిమాల్లో సందడి చేశాడు.

ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురం భీమ్​గా కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియాభట్‌ నటిస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలోచిత్రీకరణజరుగుతోంది. ఈ విషయాన్ని ఇటీవల రామ్‌చరణ్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details