మహేశ్‌బాబు కథానాయకుడిగా దర్శకుడు పరశురామ్ తీస్తున్న చిత్రం 'సర్కారువారి పాట'. కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. దుబాయ్ నుంచి తిరిగొచ్చాక ఈ చిత్రబృందం మళ్లీ గోవాకు పయనం కానున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఓ షెడ్యూల్ చిత్రీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. మహేశ్ గత చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతికే విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. 'సర్కారువారి పాట'కు తమన్ సంగీతమందిస్తున్నారు.
మహేశ్-రాజమౌళి సినిమా ఆఫ్రికా అడవుల్లో? - mahesh babu latest news
సర్కారు వారి పాట తర్వాత షెడ్యూల్ గోవాలో జరగనుందట. అలానే మహేశ్ రాజమౌళితో చేయబోయే చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్య కథతో తీయనున్నట్లు తెలుస్తోంది.
మహేశ్-రాజమౌళి సినిమా ఆఫ్రికా అడవుల్లో?
ఆఫ్రికా అడవి నేపథ్యంలో?
మహేశ్ తదుపరి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే అవకాశాలున్నాయి. అందుకోసం ఇప్పటికే కథ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అడవి నేపథ్యంలో సాగే కథతో ఆ చిత్రం రూపొందనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసమే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఆఫ్రికాలోని అడవుల్ని పరిశీలించేందుకు వెళ్లారట.