తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రుతిహాసన్​కు స్వాగతం చెప్పిన గోపీచంద్ - ravi teja movie

హీరోయిన్​ శ్రుతిహాసన్​.. హీరో రవితేజ కొత్త సినిమాలో హీరోయిన్​గా అవకాశం సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్  మలినేని ట్వీట్ చేశాడు.

హీరోయిన్ శ్రుతిహాసన్

By

Published : Oct 30, 2019, 2:33 PM IST

హీరోయిన్ శ్రుతిహాసన్​ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో నటించనుంది. చివరసారిగా 'కాటమరాయుడు'లో కనిపించిన ఈ భామ.. రవితేజ కొత్త సినిమాలో హీరోయిన్​గా అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్​ చేశాడు. "మల్టీ టాలెంటెడ్ నటి శ్రుతిహాసన్​కు స్వాగతం" అంటూ రాసుకొచ్చాడు.

దర్శకుడు గోపీచంద్​ మలినేని ట్వీట్

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ.. పోలీస్​ అధికారిగా నటిస్తున్నాడు. ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇదే దర్శకుడితో 'డాన్​శీను', 'బలుపు' వంటి సినిమాలు చేశాడీ హీరో. ఈ చిత్రాన్ని బి.మ‌ధు నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్లడించనున్నారు.

ఇది చదవండి: పోలీస్ దుస్తుల్లో హీరో రవితేజ ఐదోసారి..!

ABOUT THE AUTHOR

...view details