చిన్నారులు చిన్ని చిన్ని చేతులతో చేసే పనులు తల్లిదండ్రులకు ఆనందాన్నిస్తాయి. అలాంటి అనుభవమే హీరో షారుక్ ఖాన్‌కు ఎదురైంది. తన చిన్న కొడుకు అబ్రామ్ వేసిన ఓ స్కెచ్ చూసి, ఆనందంతో మురిసిపోతున్నాడు. ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
ఈ స్కెచ్‌లో తన బొమ్మతో పాటు నాన్న షారుక్ బొమ్మను వేశాడు అబ్రామ్. హార్ట్ గుర్తును అనుసంధానం చేసేలా గీశాడు. 'అబ్రామ్ అండ్ పాపా' అని ఆ కాగితంపై ఓ వ్యాఖ్యను జోడించాడు.
"నా కుమారుడు అబ్రామ్ వినయం, ప్రేరణ, విజయం నాకు ఎన్నో నేర్పాయి. డ్రాయింగ్‌లో నేను ఏ కారణం లేకుండా నవ్వుతున్నానంటా. అందుకే తన కంటే నేను బాగా కనిపిస్తున్నానని అబ్రామ్ చెప్పాడు"