తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షారుక్ తనయ సుహానా ఎంట్రీకి రంగం సిద్ధం! - సుహానా ఖాన్​ వెండితెర అరంగేట్రం

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్​ను దర్శకురాలు జోయా అక్తర్​ త్వరలోనే వెండితెరకు పరిచయం చేయనున్నారని తెలిసింది. ఈ భామ కోసం ఓ మంచి కథను సిద్ధం చేస్తున్నారట. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

suhana khan
సుహానా ఖాన్​

By

Published : Aug 18, 2021, 9:09 PM IST

బాలీవుడ్ స్టార్​ హీరో షారుక్​ ఖాన్​ తనయ సుహానా ఖాన్ సినీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఆమెను దర్శకురాలు జోయా అక్తర్​ వెండితెరకు పరిచయం చేయనుందంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. సుహానా ప్రధాన పాత్రలో ప్రముఖ కామిక్​ పుస్తకం 'ఆర్చి'ని సినిమాగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. టీనేజ్​ రొమాంటిక్​ కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. ప్రస్తుతం జోయా ఈ పుస్తకాన్ని ఇండియన్​ వెర్షన్​లోకి అభివృద్ధి చేసే పనిలో ఉన్నారని సమాచారం.

సుహానా ఖాన్​

సుహానాతో పాటు మరో ఇద్దరు స్టార్ కిడ్స్​ను​ కూడా ఈ చిత్రంతోనే పరిచయం చేయాలని జోయా ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం చిత్రబృందం.. మిగతా నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియలో బిజీగా ఉంది. అంతా అనుకున్నట్లు జరిగి సినిమా రూపొందితే నెట్​ఫ్లిక్స్​లో ఈ మూవీ విడుదల కానుంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అంతకుముందు సుహానా 'ది గ్రే పార్ట్​ ఆఫ్​ బ్లూ' షార్ట్​ ఫిల్మ్​లో నటించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. యూట్యూబ్​లో ఈ చిత్రం అధిక వ్యూస్​ను దక్కించుకుంది. సోషల్​మీడియాలోనూ సుహానా చురుగ్గూ ఉంటూ తరచూ ఫొటోలను పోస్ట్​ చేస్తుంటుంది.

ఇదీ చూడండి: షారుక్ తనయ సుహానా 'జబర్దస్త్ క్లిక్స్'

ABOUT THE AUTHOR

...view details