తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈ ఏడాది థియేటర్లలో సందడి చేస్తా' - అభిమానులకు షారుక్​ న్యూ ఇయర్​ విషెస్​

అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​.. ఈ ఏడాది తప్పకుండా థియేటర్లలో తన సినిమాతో సందడి చేస్తానని చెప్పారు. అయితే తాను నటిస్తోన్న చిత్రాల్లో ఏ సినిమాతో కనువిందు చేయనున్నారో వివరాలు తెలియజేయలేదు.

sharukh
షారుక్​

By

Published : Jan 2, 2021, 3:22 PM IST

Updated : Jan 2, 2021, 3:33 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్​ ఖాన్ అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఈ ఏడాది తప్పకుండా వెండితెరపై కనువిందు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన నటిస్తోన్న సినిమా థియేటర్లలో సందడి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఇన్​స్టాలో పంచుకున్నారు.

"ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆలస్యంగా తెలపాల్సి వచ్చింది. 2020 అందరికీ ఓ చెత్త ఏడాది. ఇకపై అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. 2021లో వెండితెరపై కలుద్దాం. "

-షారుక్​ ఖాన్​, బాలీవుడ్​ స్టార్​.

ప్రస్తుతం షారుక్​.. సిద్దార్థ్​ ఆనంద్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పఠాన్'​ సినిమాలో నటిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్. జాన్‌ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్​‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతోపాటు రాజ్​కుమార్​ హిరానీ, అట్లీ, అలీ అబ్బాస్​ జాఫర్​, రాజ్​-డీకే దర్శకత్వంలో వరుస సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిసింది. మరి వీటిలో ఏ సినిమాతో బాద్​షా అభిమానులు ముందుకు రానున్నారో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.

ఇదీ చూడండి : షారుక్​ 'పఠాన్' చిత్రీకరణలో సల్మాన్​!

Last Updated : Jan 2, 2021, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details