ఆస్ట్రేలియాలోని ప్రముఖ లా ట్రోబ్ విశ్వవిద్యాలయం... పీహెచ్‌డీ పరిశోధనల్లో కృషి చేస్తోన్న విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్‌షిప్ ఇస్తోంది. గతేడాది దీన్ని షారూక్ పేరు మీదకు మార్చి... 'షారుఖ్‌ఖాన్ లా ట్రోబ్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్'గా పిలుస్తున్నారు. కేరళకు చెందిన యువ మహిళా పరిశోధకురాలు గోపిక.. ఈ ఏడాది ఈ ఆర్థిక సాయానికి ఎంపికైంది. తాజాగా జరిగిన ఓ వేడుకలో ఆ విద్యార్థినికి ప్రశంసాపత్రం, స్కాలర్షిప్ను అందించాడు బాలీవుడ్ బాద్షా.
" గోపిక అంకితభావాన్ని, నిర్ణయాలను నేను గౌరవిస్తాను. ఈ స్కాలర్‌షిప్‌తో ఆమె మెల్బోర్న్లో లా ట్రోబ్ యూనివర్సిటీలో చదివేందుకు వీలు కలుగుతుంది. తను భారతదేశ వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచాలన్న కలను ఈ అవకాశం ద్వారా నిజం చేసుకుంటుందని ఆశిస్తున్నాను."