బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ చాలా కాలం తర్వాత అభిమానులకు తాను నటించబోతున్న కొత్త సినిమా కబురు అందించారు. ఆయన నటించిన 'దిల్వాలే దుల్హానియా లే జాయేంగే' సినిమా విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటన చేశారు. 'పఠాన్' అనే టైటిల్‌తో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో షారుఖ్ సరసన దీపికా పదుకొణె నటించనుండగా.. జాన్ అబ్రహం ఓ కీలకపాత్ర పోషించనున్నారు. నవంబరు నుంచి ప్రారంభం కానున్న చిత్రీకరణలో ఎస్ఆర్కే పాల్గొనబోతున్నారు. 2021 జనవరిలో దీపిక, జాన్ అబ్రహం సెట్లో అడుగుపెట్టనున్నారు.
ముచ్చటగా మూడోసారి షారుఖ్-దీపిక రొమాన్స్ - దీపిక పదుకొణె వార్తలు
బాలీవుడ్ ఎవర్గ్రీన్ మూవీ 'దిల్వాలే దుల్హానియా లే జాయేంగే' విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కథానాయకుడు షారుఖ్ నటించనున్న కొత్త సినిమా ప్రకటన వచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 'పఠాన్' టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో షారుఖ్, దీపికా పదుకొణెతో పాటు జాన్ అబ్రహం కీలకపాత్ర పోషించనున్నారు.
దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్
ముంబయిలోని అంధేరి యుశ్రాజ్ ఫిల్మ్ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేక సెట్ రూపొందించనున్నారు. ఇందులో దాదాపుగా రెండు నెలల పాటు షారుఖ్‌పై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించనున్న 'సంకీ' అనే కొత్త ప్రాజెక్టులో షారుఖ్, దీపిక కలిసి నటిస్తారని గతంలో ప్రచారం జరిగింది. కానీ, దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.