బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్.. 'పఠాన్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కొన్నేళ్లుగా కొత్త ప్రాజెక్టులను ప్రకటించిన షారుక్.. ఇకపై వరుసగా చిత్రాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే పఠాన్ తర్వాత రాజ్ కుమార్ హిరానీ, తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి పనిచేయనున్నారు. దీని తర్వాత కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇందులో సీనియర్ సంజయ్‌దత్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈయన షారుక్ 'ఓం శాంతి ఓం', 'రావన్' సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో అలరించేందుకు రెడీ అవుతున్నారట. 'రాఖీ' పేరుతో తెరకెక్కే ఈ సినిమాను వయకామ్ 18 స్టూడియోస్ నిర్మించనుంది!