తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వినాయక్ సరసన సీనియర్ హీరోయిన్..! - sriya -vinayak

దర్శకుడు వి.వి వినాయక్ హీరోగా 'సీనయ్య' అనే చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో శ్రియ హీరోయిన్​గా నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.

వినాయక్

By

Published : Nov 23, 2019, 8:32 PM IST

దర్శకుడు వి.వి. వినాయక్‌ కథానాయకుడిగా మారాడు. నరసింహారావు తెరకెక్కిస్తున్న 'సీనయ్య' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వినాయక్‌ సరసన కథానాయిక శ్రియ నటిస్తుందంటూ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. వినాయక్‌కు భార్యగా కనిపించబోతుందట శ్రియ. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

గతంలో వినాయక్‌ దర్శకత్వం వహించిన 'ఠాగూర్‌', 'చెన్నకేశవ రెడ్డి' చిత్రాల్లో కథానాయిక శ్రియనే. ఇప్పుడు ఈ దర్శకహీరో పక్కన నటించబోతుండటం వల్ల అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. దసరా కానుకుగా విడుదల చేసిన వినాయక్‌ ఫస్ట్‌లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. త్వరలోనే ప్రతినాయకుడు వివరాలు వెలువడనున్నాయి.

ఇవీ చూడండి.. వంద కోట్ల క్లబ్​లో ఆయుష్మాన్ 'బాలా'..

ABOUT THE AUTHOR

...view details