వెంకటేశ్, శ్రియ పలు చిత్రాల్లో నటించి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు 'తులసి' సినిమాలో వెంకీ సరసన ఓ ప్రత్యేక గీతంలోనూ నర్తించి అలరించింది శ్రియ. మరోసారి ఈ ఇద్దరూ వెండితెరపై కనిపించబోతున్నారన్న ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో వినిపిస్తోంది.
మంజు వారియర్ స్థానంలో శ్రియ..! - shriya in asuran remake
'అసురన్' రీమేక్‌లో వెంకటేశ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రియ ఎంపికైనట్లు సమాచారం.
తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన 'అసురన్' చిత్రాన్ని తెలుగులో వెంకీ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలోనే శ్రియ.. వెంకీతో ఆడిపాడనుందని సమాచారం. మాతృకలో మంజు వారియర్ హీరోయిన్గా చేసింది. శ్రియను కథానాయికగా తీసుకునే విషయంపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని టాక్. అయితే ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించేదెవరో ఇంకా స్పష్టత లేదు. సురేష్ పొడ్రక్షన్స్ పతాకంపై సురేష్ బాబు, కలైపులి యస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఇవీ చూడండి.. సల్మాన్‌కు విలన్‌గా మరో దక్షిణాది నటుడు!