తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అసురన్​'లో వెంకీ సరసన శ్రియ..! - venkatesh srikanth addala

కోలీవుడ్​లో ఘనవిజయం సాధించిన అసురన్ చిత్రాన్ని.. తెలుగులో వెంకటేశ్​ రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాలో శ్రియను హీరోయిన్​గా తీసుకోనుందట చిత్రబృందం.

sriya is the heroin of venketesh asuran remake
వెంకటేష్ - శ్రియ

By

Published : Nov 29, 2019, 5:20 AM IST

తెలుగు, తమిళ చిత్రాలు పరస్ఫరం రీమేక్​లు రూపొందుతుండటం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. తాజాగా కోలీవుడ్​లో ధనుష్‌ నటించిన అసురన్‌ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్​ రీమేక్ చేయనున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శ్రియ కథానాయికగా నటించనుందట.

ఈ విషయంపై శ్రియతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిందట చిత్రబృందం. త్వరలో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను వెంకటేశ్​ సోదరుడు నిర్మాత సురేష్‌ బాబు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇంతకు ముందు శ్రియ...- వెంకటేశ్​తో కలిసి రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుభాష్‌ చంద్రబోస్‌’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ‘గోపాల గోపాల’లోనూ అలరించింది.

ఇదీ చదవండి: కేజీఎఫ్​2 ఇందిరా పాత్రలో రవీనా టాండన్..!

ABOUT THE AUTHOR

...view details