ఉషాకిరణ్ మూవీస్ వారి 'ఇష్టం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ శ్రియ. తర్వాత నాగార్జునతో కలిసి 'సంతోషం' చిత్రంలో నటించి మెప్పించింది. ఇక అక్కడ నుంచి తెలుగులో ప్రముఖ కథానాయికగా వెలుగొందింది. తాజాగా ఈ సొట్ట బుగ్గల సుందరి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్‌ఆర్ఆర్' చిత్రంలో నటించనుంది. శ్రియ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఛత్రపతి' సినిమాలో ప్రభాస్‌కి జోడీగా కనిపించింది.
'ఆర్ఆర్ఆర్'లో శ్రియ.. ఏ పాత్రకోసమో! - ఆర్ఆర్ఆర్లో శ్రియ
సొట్టబుగ్గల సుందరి శ్రియ 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటించనుంది. ఈ విషయమై తాజాగా స్పష్టతనిచ్చింది. కానీ ఎలాంటి పాత్రలో నటిస్తుందనేది మాత్రం తెలుపలేదు.
శ్రియ
ప్రస్తుతం ఇదే విషయాన్ని శ్రియ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తాను 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఎలాంటి పాత్రలో ఈ భామ కనిపిస్తుందో అనే విషయమై చాలామందికి ఉత్సుకత కలిగిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌తో కలిసి శ్రియ కనిపించనుందట.
ప్రస్తుతం శ్రియ తమిళంలో 'నరగాసూరన్' అనే చిత్రంలో నటిస్తోంది. హిందీలో 'తడ్క' అనే చిత్రం చేస్తుంది. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వాయిదా పడింది.
Last Updated : Jun 8, 2020, 2:29 PM IST