ఇంట్లో ఒంటరిగా తల్లీకూతుర్లు.. ఆ సమయంలో పులి వస్తే వాళ్లిద్దరూ ఏం చేశారు. జంతువు నుంచి పాపను కాపాడేందుకు తల్లి ఎలాంటి ప్రయత్నాలు చేసింది?. ఇదే కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'గర్జన'. ప్రముఖ నటీనటులు శ్రీరామ్,రాయ్‌లక్ష్మీ జంటగా నటించారు. ఈరోజు సినిమా తెలుగు టీజర్ విడుదలైంది. ఇందులో అమ్మాయి అరుపుతో మొదలైన వీడియో... ఆద్యంతం ఆసక్తితో రూపొందించారు. పెద్దపులిని గ్రాఫిక్స్‌లో అద్భుతంగా చూపించారు. మనిషి, మృగం.. ఇద్దరిలో ఎవరు ప్రమాదకరం అనేది కథాంశం.
పొలాచ్చి, తలకొన, మున్నార్, చెన్నై, ఊటీ, కొడైకెనాల్ తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. త్వరలోనే ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.