తండ్రి నిర్మాత.. తాను కూడా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు.. జీవితం ఇలా ఉంటే బోర్ కొట్టిందేమో...! సరదాగా హైదరాబాద్ నగరంలో సాధారణ పౌరుడిలా తిరిగేశాడు టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. డబ్బుకు డబ్బు.. హోదాకు హోదా వేటికీ కొదవలేని ఈ యువ నటుడు బస్సుల్లో, మెట్రో రైల్లో, ఆటోలో, బైక్పై చక్కర్లు కొట్టాడు. ఈ ఫొటోలను తన ట్విట్టర్లో పంచుకున్నాడు.
"కొంచెం కొత్తగా ఉంటుందని హైదరాబాద్ వీదుల్లో తిరుగుతూ ఫొటోల కొసం ప్రయత్నించాను. ప్రజలు తమ పనులకు వెళ్లేందుకు వాడే వివిధ రకాల ప్రయాణ సాధనాలను చూశాను" - బెల్లంకొండ శ్రీనివాస్ ట్వీట్