వ్యాఖ్యాతగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీముఖి. బిగ్బాస్ షో ద్వారా తన అల్లరి, అభినయంతో ఎంతో మంది ఆదరణ సొంతం చేసుకుంది. ప్రతి ఇంట్లో ఓ ముద్దుబిడ్డగా మారింది. అప్పుడప్పుడూ వెండితెరపై మెరుస్తున్న శ్రీముఖి.. సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో చురుగ్గా ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చాట్ చేసింది. కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలూ ఇచ్చింది.
ఎవరైనా స్నేహితుడికి అబద్ధం చెప్పారా?
శ్రీముఖి: సీరియస్‌గా ఎప్పుడూ చెప్పలేదు. సరదాగా అబద్ధాలు చాలా సార్లు చెప్పా.
దుస్తులు లేకుండా ఈత కొట్టారా?
శ్రీముఖి:ఎప్పుడూ ఈత కొట్టలేదు. (నవ్వులు)
పొరుగింటి వారిపై ఎప్పుడైనా నిఘా పెట్టారా?
శ్రీముఖి: అలా ఎప్పుడూ చేయలేదు.
తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పారా?
శ్రీముఖి: అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పాను.
ఎవరినైనా మోసగించారా?
శ్రీముఖి: లేదు
మీ వయసు విషయంలో అబద్ధం చెప్పారా?