తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెబ్​ సిరీస్​: సీనియర్​ ఎన్టీఆర్​ పాత్రలో శ్రీకాంత్ - tollywood news

సీనియర్ ఎన్టీఆర్​ జీవితం ఆధారంగా రూపొందుతున్న 'చదరంగం' అనే వెబ్​ సిరీస్​ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వెబ్​ సిరీస్​: సీనియర్​ ఎన్టీఆర్​ పాత్రలో శ్రీకాంత్
చదరంగం వెబ్​ సిరీస్​లో శ్రీకాంత్

By

Published : Feb 19, 2020, 5:16 AM IST

Updated : Mar 1, 2020, 7:22 PM IST

టాలీవుడ్​ దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా, గతడేది ఓ బయోపిక్​ (ఎన్టీఆర్: కథానాయకుడు, మహానాయకుడు) వచ్చింది. ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్​ రోల్​లో కనిపించి, ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని 'చదరంగం' అనే వెబ్​ సిరీస్​ తీస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదరంగం వెబ్​ సిరీస్​లో శ్రీకాంత్, ఇతర పాత్రధారులు

సీనియర్ ఎన్టీఆర్​ జీవితంలో జరిగిన, ఆయన సన్నిహితుల్లో అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన ఓ సంఘటన ఆధారంగా ఈ సిరీస్​ రూపొందిస్తున్నారు. శ్రీకాంత్.. ఎన్టీఆర్​ పాత్రలో కనిపించనున్నాడు. మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. రాజ్ అనంత దర్శకత్వం వహిస్తున్నాడు. నాగినీడు, రవి ప్రకాశ్, చలపతిరావు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​లో త్వరలో స్ట్రీమింగ్​ కానుంది 'చదరంగం'.

ఇది చదవండి:సీనియర్​ ఎన్టీఆర్​ ఇంట్లో పుట్టా.. అలా నటన వైపు వచ్చా

Last Updated : Mar 1, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details